పేరులో ఘనం..ఆచరణలో నామమాత్రం నాబార్డు...

 

హైద్రాబాద్, నవంబర్ 9, (globelmedianews.com)
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నాబార్డు ద్వారా అనేక సేవలు అందిస్తోంది.  సహకార సంఘాల నిర్మాణం, నిర్వహణ లోపాల కారణంగా అవి  పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. దీంతో రైతులు నాబార్డు నుంచి పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేక పోతున్నారు . వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కోసం వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షా  సంఘం 1979లో చేసిన  సిఫార్సుల మేరకు 1982 జులై 12 తేదీ న  జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకును ప్రారంభించారు.ఈ బ్యాంకు స్థాపన కోసం పార్లమెంటు చట్టం చేసింది . వ్యవసాయ పరోక్ష విత్త సహాయక విభాగాల నిధులు ఈ జాతీయ బ్యాంకుకు బదిలీ చేయబడ్డాయి. వ్యవసాయం, గ్రామీణభివృద్ధికి సంబంధించిన శిఖరాగ్ర సంస్థగా ఈ బ్యాంకు పని చేస్తున్నది . 
పేరులో ఘనం..ఆచరణలో నామమాత్రం  నాబార్డు...

1982 నవంబర్ 5 న  దీనిని జాతికి అంకితం చేశారు. గ్రామాల్లో ఆర్ధిక కార్యకలాపాల  అభివృద్ధి కోసం వ్యవసాయరంగం, చిన్న, కుటీర ,గ్రామ పరిశ్రమలు , చేతి పనుల పరిశ్రమలు మొదలైన వాటికి పెట్ట్టుబడి, రీఫైనాన్స్  సౌకర్యం కల్పించడం ద్వారా సమగ్ర గ్రామీణాభివృద్ధికి తోడ్పడటం.సహకార పరపతి సంఘాలకు , భూమి అభివృద్ధి  బ్యాంకులకు ,ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు, మధ్యకాలిక ,దీర్ఘకాలిక పరపతి లేదా రీఫైనాన్స్ సమకూర్చటం.సహకార పరపతి సంస్థలకు వాటా మూలధనాన్ని సమకూర్చటం కోసం రాష్ట ప్రభుత్వాలకు 20 సంవత్సరాల  కాల పరిమితికి లోబడిన దీర్ఘకాలిక రుణాలు సమకూర్చటం . వ్యవసాయ , గ్రామీణాభివృద్ధితో  సంబంధo కలిగి , కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ  సంస్థకైనా దీర్ఘకాలిక రూణాలు ఇవ్వటం లేదా మూలధనం సమకూర్చటం లేదా సేక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిన్న కుటీర ,గ్రామీణ  పరిశ్రమల అభివృద్ధికి ఇతర జాతీయ స్థాయి , రాష్ట స్థాయి సంస్థల కార్యకలాపాలను సమన్వయపరచటం .ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు , ప్రాథమిక పరపతి సంస్థలు తప్ప ఇతర సహకార బ్యాంకులను  తనిఖీ చేయడం.గ్రామీణ అభివృద్ధి కోసం పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయటం. ఈ బ్యాంకుకు అధీకృత మూలధనం రూ .500 కోట్లు. చెల్లించిన మూలధనం రూ.100 కోట్లు. .దీనిని కేంద్ర ప్రభుత్వం , రిజర్వు బ్యాంకు సమానంగా సమకూర్చాయి . 2016 మర్చి నాటికి చెల్లించిన మూలధనం రూ.5000 వేల కోట్లకు పెంచబడింది .  రిజర్వు బ్యాంకు విభాగమైన జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి, జాతీయ వ్యవసాయ స్థిరీకరణ నిధి నాబార్డుకు  బదిలీ చేశారు. ప్రపంచ బ్యాంకుకు , అంతర్జాతీయ అభివృధ్ధి సంస్థలు వాటి పథకాల అమలుకు అవసరమైన నిధులను నాబార్డుకు చెల్లిస్తున్నాయి. ఆర్‌ఐడిఎఫ్ సంబంధించిన డిపాజిట్లు , మార్కెట్ రుణాల ద్వారా నాబార్డు అదనపు  నిధులను  సమకూర్చు కుంటోంది . సారంగి కమిటీ  చిన్న  రైతులకు అందే పరపతిని మెరుగు పరచటానికి తీసుకోవలసిన చర్యలను సూచించటానికి నాబార్డు అధ్యక్షుడు యూ. సి.  సారంగి అధ్యక్షతన ఒక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది .

No comments:
Write comments