ప్రశాంత్ ప్రేమలో విఫలమయ్యాడు

 

హైదరాబాద్ నవంబర్ 19 (globelmedainews.com)
హైదరాబాద్  కూకట్ పల్లి కి  చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు పాకిస్థాన్ లో అరెస్టయ్యాడు. అతడితోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన టెకీ దరీలాల్ ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. పాక్లోని బహావల్  పూర్ వద్ద కొలిస్థాన్ ఎడారిలో వీరిని సోమవారం అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్ పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్ మీడియా పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ కు ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ యువతి కోసం వెతుక్కుంటూ.. గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది.
ప్రశాంత్ ప్రేమలో విఫలమయ్యాడు

ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్.. అటూఇటూ తిరుగుతూ.. ఎడారి మార్గంలో పాకిస్థాన్కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.ప్రశాంత్ తండ్రీ దుర్గా మల్లేశ్వరరావు మాట్లాడుతూ మా అబ్బాయి సెన్సిటివ్. ఒక  అమ్మయి తో ప్రేమలో పడ్డాక కాస్త డిస్టర్బ్ అయ్యాడు. తరువాత సెట్ అవ్వడం జరిగింది. మిస్సింగ్ కేసుగా మాదాపూర్ పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేయడం జరిగింది ఇంత లొనే మాకు ఈ న్యూస్ తెలిసింది..  ప్రేమలో పడ్డాక మానసికంగా ఇబ్బంది పడ్డాడని అయన తెలిపారు.

No comments:
Write comments