మందుల్లేవ్..! (కృష్ణాజిల్లా)

 

మచిలీట్నం, నవంబర్ 2 (globelmedianews.com): 
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన కొన్ని మందుల కొరత నెలలుగా వేధిస్తోంది. గర్భిణులకు అవసరమైన ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, రేచీకటి రాకుండా నిరోధించే విటమిన్‌-ఎ డ్రాప్స్‌ దాదాపు ఐదునెలలుగా ఆసుపత్రుల్లో అందుబాటులో లేకుండా పోయాయి. తగు చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పేద వర్గాలకు శాపంగా మారుతోంది. పేద, మధ్య తరగతి వర్గాల వైద్య పరమైన అవసరాలకు ప్రభుత్వాసుపత్రులే దిక్కుగా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. అవసరమైన మందుల సరఫరా విషయంలో చోటుచేసుకుంటున్న అలక్ష్యం విమర్శలకు తావిస్తోంది. ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు సరఫరా లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. 
మందుల్లేవ్..! (కృష్ణాజిల్లా)

జిల్లాలో ప్రతి నెలా రమారమి 6,000 గర్భిణుల కేసులు నమోదవుతుంటాయి. ప్రతి గర్భిణికి మూడో నెల నుంచి క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు ఐరన్‌ఫోలిస్‌ యాసిడ్‌ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. నెలకు 30 మాత్రలు చొప్పున 9 నెలలు నిండే సమయానికి 180 మాత్రలు ఇవ్వాలి. గర్భిణుల్లో ఐరన్‌ లోపం ఉంటే తలెత్తే ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాసుపత్రులకు వచ్చేవారికి తప్పనిసరిగా ఈ మాత్రలు అందజేయాలి.ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది పేద వర్గాలకు చెందిన వారే కావడంతో వారు ఐరన్‌ మాత్రలు బయట మార్కెట్‌లో కొని వినియోగించే అవగాహన లేక అలాగే కాలం నెట్టుకొస్తున్నారు. రేచీకటి వ్యాధిని నివారించే క్రమంలో బిడ్డ పుట్టాక విడతల వారీగా విటమిన్‌-ఎ చుక్కలు వేయాలి. ఇతర వ్యాక్సిన్‌లతో పాటు బిడ్డకు తొమ్మిది నెలల వయసు వచ్చాక విటమిన్‌-ఎ చుక్కలు వేయాలి. తదనంతరం ఆరు నెలల వ్యవధితో బిడ్డకు ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ వేయాలి. బాల్య దశలో విటమిన్‌-ఎ లోపిస్తే దృష్టి పరమైన సమస్యలతో పాటు చర్మ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్ఛు క్రమం తప్పకుండా అయిదేళ్లలోపు పిల్లలందరికి విటమిన్‌-ఎ చుక్కల మందు వేయిస్తే కంటి చూపు కోల్పోకుండా ఉంటారు. అన్నపేగు, జీర్ణవ్యవస్థలోని కణాలు వృద్ధి జరిగి జీర్ణాశయంతోపాటు శరీరానికి మేలు చేకూరుతుంది. జీర్ణాశయంలో రక్షణ వ్యవస్థను మెరుగుపడటంతో పాటు. న్యుమోనియా వ్యాధి రాకుండా నివారించవచ్ఛు ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే విటమిన్‌-ఎ గత అయిదు నెలలుగా అందుబాటులో లేదు. ఫలితంగా చిన్నారులు కంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇటీవల ప్రభుత్వ పరంగా నిర్వహించిన వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రమారమి ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 30 వేల మంది చిన్నారులు వివిధ కంటి వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించారంటే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రధానమైన మందుల సరఫరా అయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది.

No comments:
Write comments