బస్సు బోల్తా….పలువురికి గాయాలు

 

కాకినాడ నవంబర్ 22 (globelmedianews.com)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మలికీపురం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మందికి గాయాలు కాగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు బోల్తా….పలువురికి గాయాలు

No comments:
Write comments