తప్పుడు కేసులు పెడుతున్నారు

 

చిత్తూరు నవంబర్ 7  (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా విస్తృతస్థాయి  సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.  వైసీపీ నేతలు పవన్ మనసు గాయపడేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు. అన్నా అంటూనే ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని గంగలో ముంచేశారని వ్యాఖ్యానించారు. జగన్ కు డబ్బు పిచ్చి వదలదని అన్నారు. 
హామీలను నేరవేర్చుతున్నాం

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా జగన్ వైఖరి ఉందని, సాయంత్రం ఐదు గంటలైతే చాలు, వీడియో గేములు ఆడుకుంటూ కూర్చుంటున్నారని ఆరోపించారు. తరువాత అయన  చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వైకాపా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తప్పులు బైటికి రాకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే తమ అక్రమాలకు అడ్డు ఉండదని భావిస్తున్నారని అన్నారు.  న్యాయం జరుగదని భావిస్తే ప్రజలు ఆగ్రహంతో ఎంతకైనా తెగిస్తారని ఆయన అన్నారు. వైసీపీ సర్కారు చేస్తోన్న తప్పులను బయటకు తెలియనివ్వకుండా దాచడానికి అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.  తాము అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు  చెప్పారు.

No comments:
Write comments