హైద్రాబాద్ లో యధేఛ్చగా అక్రమ నిర్మాణాలు

 

హైద్రాబాద్, నవంబర్ 6, (globelmedianews.com)
హైద్రాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుందా ..నగరంలో పర్యావరణ పరిరక్షణకు మంచిరోజులు రానున్నాయా... ఏమో ఏనుగు ఎగరా వచ్చు అంటున్నాయి గ్రేటర్ బల్దియా వర్గాలు. కొత్త కమీషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ముందస్తు ఎన్నికలు వచ్చిపడటంతో అదనంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి గా బిజీ అయ్యారు. దాంతో కమీషనరేట్  పరిపాలనా వ్యవస్థపై దృష్టిపెట్టేవీలు లేకుండా పోయిం ది.అక్రమార్కులు ఇటీవల ఎన్నికల వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకున్నారన్ని విషయం వెలుగులోకి రావటంతో టౌన్ ప్లానింగ్  అక్రమాలపై కన్నెర్ర చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిధ్దం చేయాలని అధికారులను ఆదేశించారు. 
హైద్రాబాద్ లో యధేఛ్చగా అక్రమ నిర్మాణాలు

అనుమతులు మాత్రమే ఆన్‌లైన్ లో జరుగుతుండగా అక్రమ నిర్మాణాలు నియంత్రణ మాత్రం మాన్యువల్ గా జరుగుతుండటాన్ని తప్పుపట్టారు. అక్రమ నిర్మాణాల గుర్తింపు, వాటి పై తీసుకుంటున్న చర్యలను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. నగర నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ పాత్ర చాలా కీలకమైంది. ఏదైనా నగరం ప్రణాళికాబద్దంగా కనిపించిం దంటే ఆ ఘనత ముందు టౌన్ ప్లానింగ్ విభాగానికే దక్కుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగానికి  కమీషనరేట్ లోని అన్ని విభాగాలతో అనుబంధం ఉంటుంది.  విశ్వనగరంగా ఎదుగుతున్న నగరంలో కిరాయిల రూపంలో వచ్చే ఆదాయం పెరుగుతోంది. దాంతో ఏమాత్రం వీలుచిక్కినా తాహతుకు తగిన నిర్మాణాలు చేపడుతూ నగరవాసులు నిర్మాణాలు జరుపుతూ కిరాయిలకు ఇస్తున్నారు. దాంతో ప్రతియేటా గ్రేటర్ హైదరాబాద్‌లో సగటున 16 వేల అనుమతులు జారీ అవుతున్నాయంటే నిర్మాణాలకోసం ఏమేరకు డిమాండ్ ఉందో తెలుస్తోంది.. .టౌన్ ప్లానింగ్ లో కిందిస్థాయి నుంచి అవినీతికి బీజం పడుతోంది.జీప్లస్ ఒన్ కు పర్మిషన్లు తీసుకొని బహుళ అంతస్తులు కడుతున్నా చర్యలు తీసుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.భాధ్యత పరంగానే కీలకమే గాకుం డా గ్రేటర్ బల్దియాకు ఆదాయాన్ని అందించటంలోనూ ప్రాపర్టీ ట్యాక్స్ తరువాత  ఫీజుల రూపంలో టౌన్ ప్లానింగ్ ది చెప్పుదగిన స్థానం. కాని వారికి కావలసిన సిబ్బందిని సమకూర్చటంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. నగరం నుంచి వివిధ రూపంలో వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకోవటంలో చూపిన శ్రధ్ద సిబ్బందిని సమకూర్చటంలో చూపలేదనన్న విమర్శ ఉంది.  ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం,  కార్పొరేటర్లు వీరిని ఆసరా చేసుకొని తామేమీ తక్కువతిన్నామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు పలుచోట్ల సిబ్బంది పై ఒత్తిళ్లకు దిగిటమే గాక, దాడులకు దిగిన  సందర్భాలున్నాయి.

No comments:
Write comments