గగుర్పాటు కల్గించే ప్రియంకారెడ్డి హత్యాచారం

 

హైద్రాబాద్, నవంబర్ 30(globelmedianews.com)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ (25) హత్య కేసు మిస్టరీ వీడింది. కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌‌లలో నిందితుల దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.షాద్‌నగర్ రహదారిపై ఓ పెట్రోలు బంక్‌లో ఇద్దరు అనుమానితులు బాటిల్‌లో పెట్రోలు నింపుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితులు ఉపయోగించిన స్కూటీ బాధితురాలిదేనని తెలుస్తోంది. బాధితురాలిని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది.
గగుర్పాటు కల్గించే ప్రియంకారెడ్డి హత్యాచారం

బుధవారం సాయంత్రం బాధితురాలు తన స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. గచ్చిబౌలిలో చికిత్స నిమిత్తం స్కూటీ మీద బయలుదేరిన ఆమె.. తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద తన వాహనాన్ని పార్క్ చేసి గచ్చిబౌలి వెళ్లి వచ్చారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తొండుపల్లి చేరుకున్న బాధితురాలిని నిందితులు ట్రాప్ చేసి అఘాయిత్యం చేశారు.తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో వైద్యురాలిని అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హ త్య చేసినట్లు భావిస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి 28 కి.మీ. దూరంలోని షాద్‌నగర్ వరకు తీసుకెళ్లారు. గురువారం (నవంబర్ 28) తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య చటాన్‌పల్లి వంతెన కింద మృతదేహాన్ని దహనం చేసినట్లు భావిస్తున్నారు. 4.30 గంటల సమయంలో స్థానిక పాల వ్యాపారి మృతదేహం తగలబడుతున్నట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

No comments:
Write comments