ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు

 

హైద్రాబాద్, నవంబర్ 29 (globelmedianews.com)
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో సంచలనం రేపిన ప్రియాంకారెడ్డి హత్యకేసు మెల్లిగా ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకసులో పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంకా కేసులో ప్రధాన నిందితుడ్ని మహ్మద్ పాషాగా నిర్థారించినట్లు సమాచారం.. అతడు నారాయణ్‌పేట్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రియాంకారెడ్డిని లారీ డ్రైవర్ క్లీనర్ హత్య చేసినట్లు నిర్ధారించారు.పాషా మరో ముగ్గురితో కలిసి ప్రియాంకపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. 
ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు

స్కూటీని ముందే పంక్చర్ చేసిన నలుగురు దుండగులు.. పంక్చర్ వేయిస్తామంటూ ఆమెను నమ్మించినట్లు తెలుస్తోంది. లారీ అడ్డుగా పెట్టి ఆమెపై దాడిచేసిన నలుగురు దుండగులు.. లారీ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో రేప్ చేసి.. తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. డెడ్ బాడీని లారీలో ఎక్కించి అండర్ పాస్ వరకు తీసుకెళ్లగా.. ఆమె స్కూటీని మరో వ్యక్తి నడుపుకుంటూ వెనకాలే వెళ్లినట్లు తేలింది. డెడ్ బాడీని అండర్ పాస్ కింద తగులబెట్టినట్లు తేలింది.ప్రియాంకారెడ్డి డెడ్ బాడీని కిరోసిన్‌తో కాల్చినట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. కిరోసిన్‌తో తగులబెట్టినట్లు తేలడంతో డ్రైవర్లే హత్యచేసినట్లు పోలీసుల నిర్థారణకు వచ్చారు. ప్రియాంకారెడ్డి డెడ్‌బాడీ 70శాతం కాలిపోయినట్లు తేలింది. డెడ్ బాడీకి దుప్పట్లు చుట్టి కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు గుర్తించారు. నలుగురు నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లావాసులుగా గుర్తించారు. అయితే నిందుతుల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

No comments:
Write comments