టిఫిన్ బాక్స్ పేలుడులో ఇద్దరు మహిళలకు గాయాలు

 

హైదరాబాద్, నవంబర్ 8, (globelmedianews.com)
హైదరాబాద్ నగరంలో టిఫిన్ బాక్స్ పేలుడు కలకలం రేపింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జిల్లెలగూడ విజయనగర్ కాలనీలోని చెత్త కుప్పల్లో నుంచి తీసిన టిఫిన్ బాక్స్లో పేలుడు సంభవించింది. రోడ్లపై చెత్త వేరుకుంటున్న ముగ్గురు మహిళలు అందులో  నిర్మల అనే మహిళ కు టిఫిన్ బాక్స్ దొరికింది.  ఆ డబ్బాను ఆమె తెరిచే ప్రయత్నం చేసింది. డబ్బాను తెరిచేందుకు నేలకేసి కొట్టింది. 
టిఫిన్ బాక్స్ పేలుడులో ఇద్దరు మహిళలకు గాయాలు

దీంతో, భారీ శబ్దంతో డబ్బా పేలిపోయింది. పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ఊస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు,  బాంబు స్కాడు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.అసలు ఆ డబ్బా ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది.. ఆ డబ్బాలో ఉన్న పదార్థాలేంటి.. అన్న దానిపై విచారణ చేపడుతున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా అలాంటి డబ్బాలు ఎక్కడైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

No comments:
Write comments