ఇసుక సత్యాగ్రమం నిర్వహించిన బీజేపీ

 

విజయవాడ నవంబర్ 04 (globelmedianews.com)
రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇసుక సత్యాగ్రహంలో కన్నా మాట్లాడారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దగ్గుబాటి పురంధరేశ్వరి, కామినేని శ్రీనివాసరావు, కిలారు దిలీప్, షేక్ బాజీ, శ్రీనివాస రాజు, సత్యమూర్తి, చాగర్లమూడి గాయత్రిభారీగా  నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.  భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కావాలనే ఇసుక కొరత సృష్టించారన్నారు. ప్రభుత్వ విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
ఇసుక సత్యాగ్రమం నిర్వహించిన బీజేపీ

రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకొని పోయారని విమర్శించారు. జూన్, జులై, ఆగస్టులో వరదలు ఎక్కడొచ్చాయని ప్రశ్నించారు. కృష్ణా, రాజమండ్రిలో వరదలొస్తే.. రాయలసీమకేమైంది? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వరదల వలన ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్తున్న సమాధానం సహేతుకంగా లేదుఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఇసుక పాలసీ కి ముహూర్తం పెట్టారని అన్నారు. ప్రభుత్వ డబ్బులతో పంచాయితీ ల భవనాలకు వైసిపి జెండా రంగులు ఎలా వేస్తారు. పు ఎన్నికల సమయంలో ఈసి కి ఎం సమాధానం చెబుతారు.భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని విమర్శించారు. సిగ్గుండాలి... మీడియా పై ఆంక్షలు విధించడానికి మీకు కూడా సొంత మీడియా ఉంది... ఒక్కటైనా నిజం రాస్తున్నారా. మంచి పాలన అందించి.. మంచి వార్తలు రాయించుకోవాలి. ప్రజల కష్టాలు పడుతుంటే... పత్రికలలో ఆ కష్టాలు రాకూడదంటే ఎలా అని నిలదీసారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని  కార్మికుల కష్టాలు తీర్చాలని అన్నారు.

No comments:
Write comments