జనవరి 1నుంచి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభం

 

హైదరాబాద్ డిసెంబర్ 23 (globelmedianews.com)
అన్ని భద్రతాప్రమాణాలతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ జనవరి 1నుంచి ప్రారంభమవుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన భద్రతాప్రమాణాలను ఆయన అధికారుల బృందంతో కలిసి పర్యటించి పరిశీలించారు. అనంతరం కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ గత సం వత్సరం నుమాయిష్ చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మైదానంలో అన్ని విధాలా భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 30 మీటర్లకు ఒక ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలకలనుగుణంగా ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 
జనవరి 1నుంచి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభం

అంతేకాకుండా లక్షన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సంపుల ఏర్పాటు, ఆయా సంపుల్లో ప్రత్యేకంగా జెట్ విద్యుత్ సరఫరా లేకున్నా పని చేసే విధంగా జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా భూగర్భ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో అగ్నిమాపక, పోలీస్ శాఖ వాహనాలు సులువుగా తిరిగే విధంగా విశాలమైన రహదారులను ఏర్పాటు చేసేందుకు గానూ స్టాళ్లసంఖ్యను 1500కు కుదించడం జరిగిందని తెలిపా రు. ఎగ్జిబిషన్ తొమ్మిది అత్యవసర ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఎగ్జిబిషన్ నిర్వహణ సందర్భంగా ఈనెల 25వ తేదీ నుంచి స్టాల్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ విచ్చేస్తున్న దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలు ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు నిర్భయంగా రావాలని కమిషనర్ అంజనికుమార్ ప్రజలను ఆహ్వానించారు.

No comments:
Write comments