ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది మృతి

 

జకార్తా డిసెంబర్ 24 (globelmedianews.com)
ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ సుమత్రా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది మృతి

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. బస్సులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అయితే లోయలో నది ప్రవహిస్తుండడంతో కొన్ని మృతదేహాలు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో సుకబుమి రిజీయన్‌లో బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

No comments:
Write comments