చెట్టు ని "ఢీకొట్టిన "వాహన దారునికి 9,500 జరిమానా

 

సిద్దిపేట డిసెంబర్ 9  (globelmedianews.com)
సిద్దిపేట పట్టణంలో  వైద్య కళాశాల వద్ద   హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి హరితహారం అధికారి ఐలయ్య కు సమాచారం ఇవ్వడం తో అక్కడికి చేరుకున్న ఐలయ్య వాహన దారుడు రాకేష్ కి  తొమ్మిది వేల ఐదు వందల జరిమానా విధించారు.
చెట్టు ని "ఢీకొట్టిన "వాహన దారునికి   9,500 జరిమానా

హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందే నని హెచ్చరించారు. మంత్రి  హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు

No comments:
Write comments