గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 9 శాతం నేరాలు తగ్గాయి

 

నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌
హైదరాబాద్‌ డిసెంబర్ 26   (globelmedianews.com)
హైదరాబాద్‌ నగరంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అంజనీ కుమార్‌.. హైదరాబాద్‌ కమిషనరేట్‌కు సంబంధించిన వార్షిక నేర వివరాలను వెల్లడించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఈ ప్రెస్‌మీట్‌ను కోఠి ఉమెన్స్‌ కాలేజీలో నిర్వహించామని తెలిపారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది 9 శాతం నేరాలు తగ్గాయని ఆయన తెలిపారు. చైన్‌స్నాచింగ్‌లు, కిడ్నాప్‌ కేసులు తగ్గాయి. చైన్‌స్నాచింగ్‌ కేసులు 30 శాతం తగ్గాయని సీపీ చెప్పారు.874 మంది చిన్నారులను కాపాడాము. 
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 9 శాతం నేరాలు తగ్గాయి

నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. పలు మతాల ఉత్సవాలు, కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. హైదరాబాద్‌ భిన్న సంస్కృతుల నగరం అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ పోలీసులకు ప్రభుత్వం, డీజీపీ నుంచి ప్రశంసలు అందాయని సీపీ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు.ఈ ఏడాది 14 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. క్రైం కేసుల్లో 42 శాతం మందికి శిక్ష పడింది. రూ. 26 కోట్లకు పైగా నగదు సీజ్‌ చేసి రికార్డు నమోదు చేశాం. ఆటో మొబైల్‌ కేసులు 17 శాతం పెరిగాయి. వరకట్న కేసులు కూడా పెరిగాయి. హైదరాబాద్‌ పరిధిలో రేప్‌ కేసులు 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 27,737 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా, నిందితుల నుంచి కోర్టు ద్వారా రూ. 8 కోట్ల 32 లక్షలు వసూళ్లు చేశాం. సిటీలో రోడ్డుప్రమాదం కేసులు 2,377 నమోదు కాగా, 261 మంది మరణించారు. హైదరాబాద్‌లో 122 పెట్రోలింగ్‌ వాహనాలు, 3 లక్షల 40 వేల సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.

No comments:
Write comments