మద్యంతోనే నేరాలు

 

హైదరాబాద్ డిసెంబర్ 12, (globelmedianews.com)
మద్యం వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహిళా సంకల్పదీక్షను  అయన ప్రారంభించారు. లక్ష్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చిందన్నారు. 
మద్యంతోనే నేరాలు

మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి సీఎం కేసీఆర్ మద్యాన్ని అరికట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారన్నారు.

No comments:
Write comments