స్పీకర్ ఏం మాట్లాడినా పర్వాలేదా?: వర్ల రామయ్య

 

విజయవాడ డిసెంబర్ 4 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్‌లో చట్టం కొంతమందికే చుట్టమా? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబుపై దుర్భాషలాడితే చట్టం వర్తించదా?, కొడాలి నాని మాట్లాడితే బూతుల కంపు కొడుతుందన్నారు. ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ మంత్రిని బూతులు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారని గుర్తుచేశారు. 
స్పీకర్ ఏం మాట్లాడినా పర్వాలేదా?: వర్ల రామయ్య

స్పీకర్ తమ్మినేని.. సోనియాగాంధీ ప్రస్తావన తెచ్చి మాట్లాడిన మాటలు శిక్షార్హం కాదా?, స్పీకర్ ఏం మాట్లాడినా పర్వాలేదా?, పద్మజను అరెస్ట్ చేసిన వాళ్లు చట్టం కొంతమందికే చుట్టమా?, కొడాలి నానిని అరెస్ట్ చేయరా?, కొడాలి నాని కంటే దారుణంగా పద్మజ ఏం మాట్లాడారని నిలదీశారు.

No comments:
Write comments