కన్నబిడ్డను అమ్మిన తండ్రి

 

భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 12, (globelmedianews.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలోని తిమ్మాపురంలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల పసికందును కన్నతండ్రే అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. సింగరాజు, సునీత దంపతులు ఏడేళ్ల క్రితం చత్తీస్గఢ్ నుంచి అటవీశాఖ కార్పోరేషన్లో వెదురు నరికేందుకు వచ్చి తిమ్మాపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఐదుగురు సంతానం కాగా... అందులో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
కన్నబిడ్డను అమ్మిన తండ్రి

సునీత ఆరోసారి గర్భం దాల్చగా... ప్రసవం కోసం అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రికి వెళ్లారు. ప్రసవం అనంతరం నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆస్పత్రిలోనే పరిచయమైన వ్యక్తికి పిల్లలు లేరని తెలపగా... రూ. 20 వేలకు తన బిడ్డను విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు సింగరాజు. రూ.15 వేలు తీసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో సునీత దగ్గరి నుంచి శిశువును బలవంతంగా లాక్కొని డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అప్పగించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్... పోలీసులకు సమాచారం ఇవ్వగా... శిశువును తల్లి ఒడికి చేర్చారు.

No comments:
Write comments