ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పు పెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ: ప్రధాని మోదీ ధ్వజం

 

రాయ్ పూర్  డిసెంబర్ 12  (globelmedianews.com)
దేశంలోని ఈశాన్య రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిప్పు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధన్‌బాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రేరేపణలతో భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఆగ్రహంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోంది. ఈశాన్య రాష్ర్టాల్లోని ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాను. 
 ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పు పెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ: ప్రధాని మోదీ ధ్వజం

ఈ బిల్లు ఆమోదం వల్ల అసోం మరియు ఇతర రాష్ర్టాల సంప్రదాయాలు, సంస్కృతి, భాషతో పాటు ఇతర వాటికి ఎలాంటి భంగం కలగదు. ఈ రాష్ర్టాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు అని మోదీ విజ్ఞప్తి చేశారు.దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చడం వల్లే ప్రజలకు తమ పార్టీపై నమ్మకం కుదురుతుందన్నారు మోదీ. భారతీయ జనతా పార్టీ అయోధ్య అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించగలిగింది. అయోధ్యపై కాంగ్రెస్‌ వివాదం సృష్టించిందే తప్ప ఆ సమస్యను పరిష్కరించలేకపోయింది. రామమందిరం నిర్మాణానికి తాము ఓ మార్గాన్ని చూపించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మైనార్టీ శరణార్ధులకు సరైన రక్షణ కల్పించలేదు. దేశంలోని శరణార్థుల పరిస్థితి పాకిస్థాన్‌లో ఉంటున్న శరణార్ధుల మాదిరి కాంగ్రెస్‌ హయాంలో ఉండేదన్నారు మోదీ.

No comments:
Write comments