నన్ను కూడా చంపేయండి: చెన్న కేశవులు భార్య

 

హైదరాబాద్ డిసెంబర్ 6 (globelmedianews.com):
దిశ హత్య కేసు లో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం  ఉదయం ఎన్ కౌంటర్ లో చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజలు మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్క కుటుంబం మాత్రం బాధపడుతోంది. తాజాగా తన భర్తను ఎన్ కౌంటర్ లో చంపేయడంపై దిశను రేప్ చేసి చంపిన చెన్నకేశవులు భార్య లక్ష్మీ స్పందించింది. 
నన్ను కూడా చంపేయండి: చెన్న కేశవులు భార్య

తన భర్త తప్పు చేశాడని పోలీసులు కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని.. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.చెన్నకేశవులు భార్య గర్భిణి.. ఈమె గర్భం దాల్చడం తో చెన్నకేశవులు పుట్టింటి కి పంపాడు. నెలలు నిండిన ఈమె ప్రసవానికి రెడీ కాగా.. చెన్నకేశవులు మాత్రం దిశను హైదరాబాద్ లో దారుణంగా హత్యాచారం చేసి చంపేశాడు. నలుగురు నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. చెన్నకేశవులు ఎన్ కౌంటర్ తో ఇప్పుడు ఆయన భార్య లక్ష్మీ పరిస్థితి దారుణంగా తయారైంది.

No comments:
Write comments