ఇతర జిల్లాలకు ఇసుక రవాణా నిలిపివేత

 

జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం
సిరిసిల్ల, డిసెంబర్ 04(globelmedianews.com)
మధ్య మానేరు జలాశయం లో 20 టీఎంసీ లకు నీటి నిల్వ ఉన్నందున దృశ్యా ఇసుక పూడికతీత కార్యక్రమాలు గనుల అభివృద్ది సంస్థ నిలిపివేయడం జరుగుతుందని, దీనివల్ల ఇకపై ఇతర జిల్లాలకు ఇసుక రవాణా నిలిపివేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్ లో జిల్లా రెవెన్యూ అధికారి  ఖీమ్యా నాయక్, జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఇతర జిల్లాలకు ఇసుక రవాణా నిలిపివేత

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ఇతర జిల్లాలకు కాళేశ్వరం పనులకు, రెండు రూముల ఇళ్ళ నిర్మాణాల నిమిత్తం ఇసుక రవాణా నిలిపివేయబడుతుందని స్పష్టం చేసారు. స్టాక్ యార్డులో ఉన్న కొద్దిపాటి ఇసుకను కూడా అర్ అండ్ ఆర్ అనంతగిరి, మరియు ప్యాకేజీ -9 మల్కపేట రిజర్వాయర్ పనుల నిమిత్తం ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయడం జరిగిందని అన్నారు. గనుల అభివృద్ది సంస్థ  స్టాక్ యార్డులో ఇసుక లభ్యత లేని దృశ్యా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ లు, దబల్ బెడ్ రూమ్  ఇంజనీర్లు ఎలాంటి దరఖాస్తులు ఇసుక గురించి అభ్యర్థించవద్దని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాల నిమిత్తం ఇసుక పర్మిట్ లు ఇప్పటికే జారీ చేసి ఉండి ఇసుక రవాణా జరగని పక్షంలో సంబంధిత అర్జీదారులు చెల్లించబడిన లోడింగ్ రుసుములు తిరిగి వాపస్ చేయబడునని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలాగే స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం ట్రాక్టర్ ల ద్వారా స్థానిక రీచ్ ల నుండి ఇసుక రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.

No comments:
Write comments