కోడి పందేల పై హైకోర్టు తీర్పును అమలు చేస్తాం: జిల్లా ఎస్పీ

 

భీమడోలు డిసెంబర్ 21  (globelmedianews.com):
 కోడి పందేల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ స్పష్టం చేశారు. స్థానిక  పోలీస్‌స్టేషన్‌లో ఆయన వార్షిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల ప్రగతిపై ఎస్పీకి సీఐ ఎం.సుబ్బారావు వివరించారు. తొలుత పోలీస్‌ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.  రహదారులపై క్రైమ్‌ రేటు తగ్గింపుపై పలుసూచనలందించారు.  
కోడి పందేల పై హైకోర్టు తీర్పును అమలు చేస్తాం: జిల్లా ఎస్పీ

అనంతరం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, ఇతర జూద క్రీడలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. గ్రామాల్లో కోడి పందేలు జరగకుండా గట్టి నిఘా ఉంచామని చెప్పారు. బైండోవర్‌ కేసులను నమోదు చేస్తున్నామన్నారు. కోడి పందేల నిర్వహణపై హైకోర్టు తీర్పును  విధిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.  జిల్లాలో పెదవేగి, సమిశ్రగూడెం ఏరియాల్లో  మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసిన  నిందితులపై పోక్సో  చట్టం మేరకు కేసులు  నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీస్‌శాఖ ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా మిత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని  ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి చేశామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్, సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై కె.శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments