పెచ్చులూడిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహం

 

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తో పాటు పలువురికి గాయాలు
యాదాద్రి భువనగిరి డిసెంబర్ 19  (globelmedianews.com)
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రమాదం తప్పింది. భవనం పెచ్చులూడి పడటంతో ఎమ్మెల్యే, మరో ఇద్దరు సర్పంచులు గాయపడ్డారు. ఆలేరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, ఇద్దరు సర్పంచులకు ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. సంఘటన వివరాల్లోకి వెళితే ఆలేరు పట్టణంలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కార్యక్రమం అనంతరం పట్టణంలోని అతిథి గృహం లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
పెచ్చులూడిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహం

ఈ క్రమంలో భవనం పైకప్పు పెచ్చులూడి పక్కనే ఉన్న గొలనుకొండ సర్పంచ్ లక్ష్మికి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరిగాడు ఇందిరా తల పడింది. దీంతో సర్పంచ్ లక్ష్మికి తలపై తీవ్రగాయాలు కాగా ఇందిరకు స్వల్ప గాయలు అయ్యాయి. పక్కనే కూర్చున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి చూపుడు వేలు, కాలి బొటన వేలుతో పాటు మోకాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి. సరిగ్గా పెచ్చులు పడిన ప్రదేశం నుంచి 15 నిమిషాల ముందే ప్రభుత్వ విప్ పక్కగా కూర్చోవడంతో ప్రమాదం పెను తప్పింది.

No comments:
Write comments