డిసెంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 

తిరుపతి డిసెంబర్ 4 (globelmedianews.com)
తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.
- డిసెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
-  డిసెంబరు 5న మధ్యాహ్నం 3 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ గోవిందరాజస్వామివారిని ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి అమ్మవార్లతోపాటు శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
డిసెంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

- డిసెంబరు 10న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ తిరుమంగైయాళ్వార్తో కలిసి సాయంత్రం 5.30 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
- డిసెంబరు 11న ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు కపిలతీర్థానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం నిర్వహిస్తారు.
- డిసెంబరు 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
- డిసెంబరు 29న శ్రవణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

No comments:
Write comments