అశ్వత్ధామపై నాగశౌర్య ఆశలు

 

హైద్రాబాద్, డిసెంబర్ 27,  (globelmedianews.com)
ఇప్పటి వరకు లవర్ బోయ్‌గా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారారు. తానే స్వయంగా కథ రాసుకుని, తన సొంత బ్యానర్‌లో ‘అశ్వథ్థామ’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన ఉషా ముల్పూరి నిర్మించిన ఈ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ థ్రిల్లర్ జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌వుతుంది.చిత్ర ప్రచారంలో భాగంగా ‘అశ్వథ్థామ’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. టీజర్‌ను హీరోయిన్ సమంత్ అక్కినేని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు అందజేశారు. 
అశ్వత్ధామపై నాగశౌర్య ఆశలు

ఈ టీజ‌ర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఛలో టీజర్ ఇక్కడే రిలీజ్ చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. ‘నర్తనశాల’ టీజర్ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం.. డిజాస్టర్ అయింది. మరి ఇప్పుడు ‘అశ్వథ్థామ’ టీజర్ రిలీజ్ చేస్తున్నాం.. బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. ఢిల్లీ, ముంబై‌లలో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ చిత్రం కథను రాసుకున్నాను’’ అని వెల్లడించారు.
తనను అందరూ లవర్ బోయ్.. లవర్ బోయ్ అంటే తనకే చాలా చిరాకుగా ఉందని అన్నారు నాగశౌర్య. ‘‘నా గురించి తెలుసునోళ్లకు గానీ, నా ఫ్రెండ్స్‌కి గానీ తెలుసు నేను అస్సలు లవర్ బోయ్‌నే కాదు. చిన్నప్పుడు నుంచీ నేను కొంచెం రఫ్‌గా ఉండేవాడిని. అందువల్ల నాకు లవర్ బోయ్ అనే ట్యాగ్ ఇచ్చేసరికి చిరాకుగా అనిపించింది. నా దగ్గరకి కమర్షియల్ స్క్రిప్ట్‌లు రావట్లేదు, అలాంటి సినిమాలు తీయట్లేదు అంటున్నారు. అందుకనే ఈ ట్యాగ్ లైన్ నుంచి బయటికి వచ్చేయాలని అని అనుకున్నాను. ‘ఛలో’తో లవర్ బోయ్ నుంచి కొంచెం బయటికి వచ్చాను. ‘అశ్వథ్థామ’తో పూర్తిగా బయటికి వచ్చేస్తానని నేను నమ్ముతున్నాను’’ అని నాగశౌర్య అన్నారు.అశ్వథ్థామ’ సినిమాకు కొత్త కెమెరామెన్ మనోజ్ రెడ్డి పనిచేశారు. ఈయన గురించి నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ రమణ తేజకు మనోజ్ రెడ్డి ఫ్రెండ్. యూఎస్‌లో ఉంటాడు. ఆయనతో తేజ మాట్లాడాడు. షో రీల్ పంపమని అడిగితే పంపించాడు. చాలా నచ్చింది. సరే మనోజ్ ఇండియాకి వచ్చే సినిమా చేద్దాం అని చెప్పాను. అన్న వస్తాను కానీ నాకు సేఫ్టీ ఏంటి అన్నాడు. కెమెరా వర్క్ నేర్చుకోవడానికి యూఎస్ వెళ్లి.. ఇప్పుడు సినిమా అవకాశం ఇస్తానంటే ఆలోచిస్తావేంటి అని అడిగాను. అతన్ని బతిమిలాడి, భయపెట్టి అక్కడి నుంచి లాక్కొచ్చాం. ఈ సినిమా రిలీజ్ కాకుండానే వేరే సినిమాలకు బుక్కయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు.‘ఛలో’ సినిమాకి తానే కథ రాశానని.. కానీ, టైటిల్స్‌లో తన పేరు వేసుకోలేదని చెప్పారు నాగశౌర్య. ‘‘హీరో సినిమా స్క్రిప్ట్ ఎందుకు రాశాడు అని అంటున్నారు. నాకు నచ్చింది.. ఒక పనిచేశాను. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఏదో చిన్న ప్రయత్నం చేశాను. ‘ఛలో’ సినిమాకు కథ నేనే రాశాను. కానీ, నేను చేసిన తప్పేంటంటే నా పేరు వేసుకోకపోవడం. ఆ తప్పు ఇక్కడ జరగకూడదని నా పేరు వేసుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడమంటే ఇష్టం. నానే కాదు చాలా మంది పుట్టినప్పటి నుంచీ కథలు చెబుతూనే ఉంటారు. నేను దాన్ని పేపర్ మీద పెట్టానంతే’’ అని నాగశౌర్య వెల్లడించారు.

No comments:
Write comments