అధికారం కోసం కాదు ప్రజా పోరాటాలే మాకు ముఖ్యం: సురవరం

 

హైదరాబాద్ డిసెంబర్ 26 (globelmedianews.com)
అధికారం కోసం  కాదు ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శిసురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు ల పాత్ర మరువలేనిదని,ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు...వర్గ దోపిడీ ని అడ్డుకుంటామన్నారు. సోషలిజం కోసం ఎప్పటికి పోరాటం చేస్తూనే  ఉంటామన్నారు. పాకిస్థాన్ లో లాగా బీజేపీ ఇక్కడ ఒక్కటే మతం ఉండాలని చూస్తుంది.దాన్ని అడ్డుకుంటాము.బీజేపీ మతం పేరుతో సామాన్య జనాలను రెచ్చ కొడుతుందని విమర్శించారు.
అధికారం కోసం  కాదు ప్రజా పోరాటాలే మాకు ముఖ్యం: సురవరం

మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్ ల ఆదాయం వంద రేట్లు పెరిగిందని,.వైద్య, విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జనాలు నిరుద్యోగం, ప్రజా సమస్యల మీద ఆలోచన చేయకూడదని మతాలను రెచ్చకొడుతున్నారని దుయ్యబట్టారు.ఎన్ఆర్సి., ఎన్పిఆర్,సిఏఏ ఇది ముస్లిం ల,హిందు ల సమస్య కాదు ఇది సెక్యులర్ గా ఉండే ప్రతి ఒక్కరి సమస్య కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడ్డాయని కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు.. ప్రజలు ఉన్నన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కమ్యూనిస్టు లు  ఐక్యం గా ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన సమయం  వచ్చింది. ఐక్యం గా పోరాటం చేద్దామని సురవరం పిలుపు నిచ్చారు.

No comments:
Write comments