వాట్సాప్‌లో త్వరలో అద్భుతమైన ఫీచర్లు

 

ముంబై డిసెంబర్ 26   (globelmedianews.com)
ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో తన యూజర్లకు పలు అద్భుతమైన ఫీచర్లను అందివ్వనుంది. వాటిలో డార్క్‌ మోడ్‌, లో డేటా మోడ్‌, మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే అనేక సోషల్ యాప్స్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ లభిస్తుండగా వాట్సాప్‌లో ఆ ఫీచర్‌ ఇంకా రాలేదు. కానీ త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనున్నారు. 
వాట్సాప్‌లో త్వరలో అద్భుతమైన ఫీచర్లు

అలాగే లో డేటా మోడ్‌ ఫీచర్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు డేటా సేవ్‌ అవుతుంది. అలాగే మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. ఇక క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా కాంటాక్ట్‌ల షేరింగ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ హైడింగ్‌ తదితర ఫీచర్లను కూడా వాట్సాప్‌ త్వరలోనే అందివ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లను వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తుండగా.. అతి త్వరలోనే కొత్త అప్‌డేట్‌ ద్వారా వాటిని వాట్సాప్‌ తన యూజర్లకు అందివ్వనుంది.

No comments:
Write comments