నకిలీ మావోయిస్టులు ఆరెస్టు

 

జనగామ డిసెంబర్ 14  (globelmedianews.com)
మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు.. జనగామలో వాట్సాప్ ద్వారా ధనవంతులను .వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు.   మోరే భాస్కర్ (37), నిమ్మల ప్రభాకర్. (25) లు చండ్రపుల్లరెడ్డి దళం పేరుతో జనగమకు చెందిన తుమ్మ రాజిరెడ్డి, అతని అన్న బాలశౌరి రెడ్డిలకు వాట్సాప్ లో 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేదంటే  కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారు. 
నకిలీ మావోయిస్టులు ఆరెస్టు

అదే విధంగా వెల్మజలకు చెందిన ఆర్ఎం పి  డాక్టర్ గాజులపటి నర్సింగరావుకు చాట్ చేసి 15 లక్షలు ఇవ్వాలని అంబర్ పేట బాయ్ పేరుతో అతని కొడుకును ఆక్సిడెంట్ చేసి చంపుతామని బెదిరించారు.  దీనిపై గుండాల పోలీసులు కేసు నమోదు చేసారు. గతంలో రాజారెడ్డి పిర్యాదు పైన పోలీసులుకేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దర్యాప్తులో దొరికిన ఆధారాల ప్రకారం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

No comments:
Write comments