ఆకట్టుకోలేకపోయిన రూలర్

 

హైద్రాబాద్, డిసెంబర్ 20, (globelmedianews.com)
నందమూరి బాలకృష్ణ హీరోగా కేయస్ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన జైసింహ సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా.. రవికుమార్‌ మీద నమ్మకంతో మరోసారి ఛాన్స్‌ ఇచ్చాడు బాలయ్య. సోనాల్‌ చౌహాన్‌, వేదిక, భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్‌, నాగినీడు ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఆడియన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటుంది.? ఎన్టీఆర్‌ బయోపిక్‌లు డిజాస్టర్‌ అయిన బాధనుంచి అభిమానులను కోలుకునేలా చేసిందా..? రివ్యూలో చూద్దాం.కథ విషయానికి వస్తే వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఏసియన్‌ గ్రూప్‌ అధినేత సరోజినీ నాయుడు (జయసుధ). ఓ బిజినెస్‌ పనిమీద ఉత్తర ప్రదేశ్‌ వెళ్లి వస్తున్న సరోజిని కారుకు తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి (బాలకృష్ణ) అడ్డుపడతాడు. కొన ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తిని హాస్పిటల్‌లో చేర్పించి కాపాడుతుంది సరోజిని. 
ఆకట్టుకోలేకపోయిన రూలర్

తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి గతం మర్చిపోతాడు. హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే సరోజిని మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ వ్యక్తే కాపాడుతాడు. దీంతో ఎవరులేని సరోజిని నాయుడు ఆ వ్యక్తిని దత్తత తీసుకొని తన కొడుకు అర్జున్‌ ప్రసాద్‌గా.. తనకు వారసుడిగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన అర్జున్‌ ప్రసాద్‌ అసలు పేరేంటి..? అతనికి ఉత్తర ప్రదేశ్‌ మినిస్టర్‌ భవానీ నాథ్‌ ఠాగూర్‌కి మధ్య వైరం ఏంటి? అన్నదే మిగతా కథ.ఎన్టీఆర్‌ బయోపిక్‌ల తరువాత గ్యాప్ తీసుకున్న బాలయ్య తన అభిమానులను అలరించే మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం స్లిమ్‌ లుక్‌లోకి మారిన బాలయ్య డ్యాన్స్‌లు ఫైట్లు ఇరగదీశాడు. అయితే తన వంతుగా ఎంత కష్టపడినా.. చాలా చోట్ల వయసు తెలిసిపోయింది. ముఖ్యంగా లుక్‌ విషయంలో బాలయ్యపై చాలా విమర్శలు వచ్చాయి. ఏరికోరి డిజైన్‌ చేసుకున్న పోలీస్‌ లుక్‌లో బాలయ్యను తెర మీద చూడటం ఇబ్బందికరంగా ఉంది. బాలయ్య వన్‌మేన్‌ షో కావటంతో ఎవరికీ పెద్దగా నటనకు ఆస్కారం లేకుండా పోయింది. హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ కేవలం గ్లామర్‌ షోకే పరిమితమైంది. వేదికకు కాస్త నటనకు అవకాశం ఉన్న తెర మీద కనిపించింది కొద్ది సేపే. భూమిక, ప్రకాష్‌ రాజ్‌, నాగినీడు లాంటి నటులంతా ఒకటి రెండు సీన్స్‌కే పరిమితమయ్యారు. ఒక్క జయసుథకు మాత్రమే కాస్త లెంగ్తీ రోల్‌ దక్కింది ఉన్నంతలో ఆమె తన పరిధి మేరకు ఆకట్టుకుంది.తొలి భాగంలో బాలయ్యను అల్ట్రా మోడ్రన్‌గా చూపించిన దర్శకుడు పెద్దగా కథ నడపకుండా బాలయ్యలోని రొమాంటిక్‌, కామెడీ యాంగిల్‌ను మాత్రమే చూపించే ప్రయత్నం చేశాడు. బ్యాంకాక్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన కామెడీ సీన్స్‌ పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో తొలి భాగం భారంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. గతంలో బాలయ్య హీరోగా ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఓ పదేళ్ల కిత్రం పరవాలేదనిపించిన ఈ ఫార్ములా ఈ జనరేషన్‌ ప్రేక్షకులను మెప్పించటం కష్టం. కథా కథనాలు మరీ మూస ధోరణిలో అనిపించినా ఇంటర్వెల్‌ సమయానికి కథ కాస్త గాడిలో పడినట్టుగానే అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్‌ సీన్‌, ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌తో బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు సెకండ్‌ హాఫ్‌లో మళ్లీ గాడి తప్పాడు. పరమ రొటీన్‌ సన్నివేశాల్లో ఏ మాత్రం ఆకట్టుకునేలా లేని బాలయ్య లుక్‌తో సెంకడ్‌ హాఫ్‌ను భరించటం మరింత కష్టంగా ఉంటుంది. ఏ మాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలు గతంలో ఎన్నో సార్లు చూసిన తరహా కథనంతో సినిమా అంతా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ మరింత ఇబ్బంది పెడుతుందిసాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే.. గతంలో బాలయ్య సినిమాలకు హిట్ ఆల్బమ్స్‌ ఇచ్చిన చిరంతన్‌ భట్ ఈ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టే ఒకే ఒక్క అంశం సినిమాటోగ్రఫి యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఏరియల్‌ షాట్స్‌, సాంగ్స్‌ను రిచ్‌గా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించటంలో కెమెరామెన్‌ పడిన కష్టం తెర మీద కనిపించింది. ఎడిటింగ్ సినిమాకు ప్రధాన సమస్యగా మారింది. లెంగ్తీ సీన్స్‌, అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. సీ కళ్యాణ్... బాలయ్య మీద ఉన్న ప్రేమతో కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాడఓవరాల్‌గా రూలర్‌.. బాలయ్య అభిమానులకు కాస్త పరవాలేదనిపించినా.. కామన్‌ ఆడియన్‌ భరిచంటం కష్టమే.

No comments:
Write comments