రాయపాటి ఇంట్లో ఐటీ సోదాలు

 

హైద్రాబాద్, డిసెంబర్ 31 (globelmedianews.com)
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని రాయపాటి కార్యాలయంలో.. బెంగళూరు, గుంటూరులో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీలకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.రాయపాటి ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.300కోట్లు లోన్ తీసుకున్నారు.. కానీ ఆ లోన్ చెల్లించకపోవడంతో.. బ్యాంక్‌లను మోసం చేసిన వ్యవహారంలో రాయపాటిపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసిందట. 
రాయపాటి ఇంట్లో ఐటీ సోదాలు

ఇండియన్ బ్యాంక్ ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లోనూ అధికారుల సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాతో పాటూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు. గుంటూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించినా.. అప్పటికే గల్లా జయదేవ్ ఉండటంతో.. ఆయన్ను నర్సరావుపేట నుంచి పోటీ చేయించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నర్సరావుపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. రాజకీయాల్లో కొనసాగుతున్నా వ్యాపారాలు కూడా చేస్తున్నారు.

No comments:
Write comments