ఐఐఐటీల్లో ... ప్రొఫెసర్ల కొరత

 

హైద్రాబాద్, డిసెంబర్ 24, (globelmedianews.com)
ఐటీలు.. దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు. మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. అన్నింట్లోనూ ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నది. కానీ స్టూడెంట్స్‌‌‌‌కు చదువు చెప్పే లెక్చరర్లకే తీవ్ర కొరత తీవ్రమవుతోంది  ఐఐటీల్లో లెక్చరర్‌‌‌‌, స్టూడెంట్ రేషియో1:10 ఉండాలి. కానీ క్వాలిటీ టీచర్లు దొరకకపోవడంతో దాదాపు అన్ని ఐఐటీల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని స్వయంగా హెచ్ఆర్డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల పార్లమెంటుకు రాతపూర్వకంగా జవాబిచ్చారు.దేశంలోని పలు టాప్ ఐఐటీలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లోని రెండు ఐఐటీల్లో ఫేకల్టీ కొరత కొంచెం తక్కువే ఉందని కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఐఐటీ హైదరాబాద్ కు మొత్తం 284 పోస్టులు మంజూరు కాగా, 206 మంది ఫేకల్టీ మెంబర్స్ ఉన్నారు. 78 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఏపీలోని ఐఐటీ తిరుపతికి 93 పోస్టులు శాంక్షన్ కాగా, 88 మంది ఫేకల్టీ మెంబర్స్ ఉన్నారు. 
ఐఐఐటీల్లో ... ప్రొఫెసర్ల కొరత

ఇక్కడ 5 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అన్ని ఐఐటీలకు కలిపి 9,718 టీచింగ్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి. వీటిలో 3,709 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఐటీ ఖరగ్‌‌‌‌పూర్‌‌‌‌లో ఎక్కువగా 481 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ తర్వాత ఐఐటీ ధన్ బాద్‌‌‌‌లో 477, ఐఐటీ బాంబేలో 414  పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటాలో ఐఐటీల్లో మరో 4 శాతం అంటే సుమారుగా 500 సీట్లు పెరగనున్నాయి. అలాగే ఐఐటీల్లో గర్ల్ స్టూడెంట్స్ సంఖ్యను పెంచేందుకు సూపర్ న్యూమరరీ సీట్ల పేరుతో అదనపు సీట్లు కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ సీట్లు పెరగడం వల్ల కూడా టీచర్ల అవసరం మరింత పెరగనుంది.ఇక అన్ని ఐఐటీల్లో కలిపి 249 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.వెయ్యి సీట్లకు పైగా ఉన్న ఐఐటీల్లో ఈ ఏడాది నుంచి సీట్లు1250కి పెరగనున్నాయి. దీంతో ఈ ఏడాది మరో 25 మంది కొత్త ఫ్యాకల్టీ అవసరం ఉంటుందని ఐఐటీ ఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.బాలకృష్ణన్ అంటున్నారు. ‘‘ఐఐటీల్లో ఫ్యాకల్టీగా తీసుకోవాలంటే హైలీ క్వాలిఫైడ్ కేండిడేట్స్ కావాలి. కానీ స్టాండర్డ్స్ ప్రకారం తగిన అర్హతలు ఉన్న టీచర్లు దొరకట్లేదు. అందుకే ఏడాదంతా ఫ్యాకల్టీ రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది” అని ఆయన చెప్పారు.  ‘‘మెరిట్ అప్లికెంట్స్ లేకపోవడం వల్లే ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతోంది. ఐఐటీల్లో ఫ్యాకల్టీగా చేరాలంటే పీహెచ్‌‌‌‌డీ చేసి ఉండటం తప్పనిసరి. అయితే బెస్ట్ ఐఐటీ గ్రాడ్యుయేట్స్ ఎవరూ పీహెచ్‌‌‌‌డీ చేయడం లేదు. టీచింగ్ పై ఇంట్రస్ట్ చూపడం  లేదు. అన్ని ఐఐటీలకూ ఇదే ప్రధాన సమఈస్యగా మారింది” అని ఐఐటీ ధన్‌‌‌‌బాద్ డైరెక్టర్ రాజీవ్ శేఖర్ వెల్లడించారు. ‘‘చాలామంది కేండిడేట్స్ క్వాలిటీ స్టాండర్డ్స్‌‌‌‌ను అందుకోలేకపోతున్నారు. దాదాపు 15 శాతం అప్లికేషన్లు మాత్రమే పరిశీలించదగ్గవి ఉంటున్నాయి. సెలెక్షన్ ప్రాసెస్‌‌‌‌లో భాగంగా12వ తరగతి నుంచి పీహెచ్‌‌‌‌డీ వరకూ కేండిడేట్ల ప్రతిభను పరిశీలిస్తాం. సంబంధిత అప్లికెంట్స్చదివిన ఇనిస్టిట్యూట్లు, ఎన్ని థీసిస్‌‌‌‌లు సమర్పించారన్నవీ పరిగణనలోకి తీసుకుంటాం” అని రాజీవ్ వివరించారు.

No comments:
Write comments