రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

 

కడప డిసెంబర్ 11, (globelmedianews.com)
రామాపురం మండలం బండపల్లె వద్ద చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పై కారు (ఇస్తిక) ను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హర్షద్, హాసజీరా, హారున్ బాష, అఫిరా అనే నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు రాయచోటి, కలికిరి ప్రాంత వాసులుగా గుర్తించారు. 
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ప్రొద్దుటూరు నుండి రాయచోటి కి కారులో వస్తుండగా జరిగిన ప్రమాదం జరిగింది.  ప్రొద్దుటూరులో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.  లారీ డ్రైవర్ పరారీలో వున్నడు. రామాపురం ఎస్ఐ మైనుద్దీన్,  సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు.

No comments:
Write comments