సర్వేంద్రియానం నయనం ప్రధానం..

 

ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి...
వనపర్తి డిసెంబర్ 4 (globelmedianews.com)
అన్ని అవయవాల్లో కెల్లా కన్నుఎంతో ప్రధాన అవయవమని అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేయించుకొని సర్వేంద్రియానాం నయనం ప్రధాన నిర్వచనానికి నాంది పలకాలని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని జంగిడి పురం యాదవ్ సంఘం భవనంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోట్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
సర్వేంద్రియానం నయనం ప్రధానం..

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో చిన్న, పెద్దలందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగిన వైద్యం పొందాలని ఆయన అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సాయి నగర్, వెంగల్ రావు నగర్, ఆర్టీసీ, ఐజయ్య నగర్ కాలనీ వాసులు 200వందల మంది పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించు కొని అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్  పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ,శ్రీరంగాపురం జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ , కొండారెడ్డి గారు పార్లమెంటు అధ్యక్షులు శివసేన రెడ్డి , వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు రంజిత్   రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ అక్తర్, మైనారిటీ అధ్యక్షులు అనీష్  జిల్లా కార్యదర్శి రాగి వేణు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్,  కృష్ణ బాబు , మాజీ ఉపసర్పంచ్ చీర్ల జనార్దన్ , ఉమ్మల రాములు ,వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ , యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా   అబ్దుల్లా  శరత్ సాగర్ ఆంజనేయులు సురేందర్ , వెంకటేష్ , కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

No comments:
Write comments