ఎంపీ అర్వింద్‌ వెంటనే రాజీనామా చేయాలి: పసుపు రైతులు

 

నిజామాబాద్‌ డిఓసెంబర్ 18  (globelmedianews.com)
లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు రోజుల్లోనే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బాండ్‌ పేపర్‌పై రాసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తమను మోసం చేశాడని పసుపు రైతులు మండిపడుతున్నారు. పసుపు రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్‌ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి జేఏసీ ధర్నా చేపట్టారు. పసుపు బోర్డు అంబాసిడర్‌ కారు లాంటిదని..టైస్‌, క్లస్టర్స్‌ హోండా లాంటివి అని మాట్లాడి రైతులను కించపరడం సరికాదన్నారు. 
ఎంపీ అర్వింద్‌ వెంటనే రాజీనామా చేయాలి: పసుపు రైతులు

ఎన్నికల్లో గుర్తుకు రాని కార్లు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయని మండిపడ్డారు. బాండ్‌ పేపర్‌ మీద పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని చెప్పారు ఇప్పుడు ఏమైందని విమర్శించారు. డిసెంబర్‌ 31లోగా బోర్డు తేకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. బోర్డును తీసుకురాకపోతే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్‌ చేసింది.జక్రాన్ పల్లిలో ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు రైతులు వినతి పత్రం అందజేశారు.

No comments:
Write comments