నిందితుల‌కే హ‌క్కులు ఉంటాయా?, మాకు హ‌క్కులు ఉండ‌వా?

 

కోర్టులో ఏడ్చిన నిర్భ‌య త‌ల్లి ఆశా దేవి
న్యూఢిల్లీ డిసెంబర్ 18 (globelmedianews.com)
నిర్భ‌య త‌ల్లి ఆశా దేవి పాటియాలా కోర్టులో ఏడ్చేశారు. నిందితుల‌కే హ‌క్కులు ఉంటాయా, మాకు హ‌క్కులు ఉండ‌వా అని ఆమె క‌న్నీరు పెట్టారు. 2012 గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ‌ విచార‌ణ‌ను వాయిదా వేయ‌డంతో నిర్భ‌య త‌ల్లి ఆవేద‌న‌కు గ‌ర‌య్యారు. ఢిల్లీలోని పాటియాలా కోర్టులో ఆమె క‌న్నీరుపెట్టారు. ఏడుస్తున్న ఆశాదేవిని ఓదార్చేందుకు జ‌డ్జి ప్ర‌య‌త్నించారు. మీ ప‌ట్ల నాకు సానుభూతి ఉన్న‌ద‌ని, ఒక‌రు చనిపోయార‌న్న విష‌యం నాకు తెలుసు, కానీ వారికి కూడా హ‌క్కులు ఉన్నాయ‌ని జ‌డ్జి తెలిపారు. 
నిందితుల‌కే హ‌క్కులు ఉంటాయా?, మాకు హ‌క్కులు ఉండ‌వా?

మీ ఆవేద‌న‌లు వింటాం, అలాగే చ‌ట్టానికి లోప‌బ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని నిర్భ‌య త‌ల్లితో జ‌డ్జి చెప్పారు. నిందితుల డెత్‌వారెంట్ గురించి జ‌రిగిన వాద‌న‌ల స‌మ‌యంలో జ‌డ్జి ఇలా వ్యాఖ్యానించారు. నిందితులు క్ష‌మాభిక్ష కోసం కోర్టును ఆశ్ర‌యిస్తున్నారా లేదా అన్న విష‌యాన్ని తెలుపాల‌ని కోర్టు అధికారుల‌ను కోరింది. కోర్టు బ‌య‌ట కూడా నిర్భ‌య త‌ల్లి క‌న్నీరుమున్నీర‌య్యారు.

No comments:
Write comments