అటో లారీ ఢీ....ఇద్దరు విద్యార్ధుల మృతి

 

హైదరాబాద్ డిసెంబర్ 31, (globelmedianews.com)
 ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఒక ఇసుక లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఆటోలో  హబ్సిగూడ  భాష్యం స్కూల్ చెందిన విద్యార్థులు వెళుతున్నారు. ప్రమాదం తరువాత డ్రైవర్ లారీ వదిలి పెట్టి పరారయ్యాడు. బాధితుల  తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకుని శోకసముద్రంలో మునిగిపోయారు.
అటో లారీ ఢీ....ఇద్దరు విద్యార్ధుల మృతి

No comments:
Write comments