తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం సాధ్యం : మంత్రి ఈటల

 

హైదరాబాద్ డిసెంబర్ 16 (globelmedianews.com)
మహిళ శిశు సంక్షేమ శాఖ ఎంత బాగా పనిచేస్తే నాకు అంత మంచి పేరు వస్తది అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో బాలామృతం ప్లస్‌ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కలిసి ప్రారంభించారు. రోగం వచ్చిన తర్వాత నయం చేయడం ఖర్చుతో కూడుకున్నది. రోగం రాకుండా చేస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటది. అపుడే ఆరోగ్య తెలంగాణ వస్తది అనే స్వార్థం నాది. ఆరోగ్య సమాజం కావాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో 15 గుడ్లు ఉంటే తెలంగాణ వచ్చాక 30 గుడ్లకు పెంచుకున్నాం. పాలు 200 ఎం.ఎల్ ఇస్తున్నాం. 
తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం సాధ్యం : మంత్రి ఈటల

మొదటిసారిగా పెద్ద ఎత్తున గుడ్లు, పాలు ఇవ్వాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాం. దీనివల్ల కొంత ఉపశమనం లభిస్తుందని భావించిన రాష్ట్రం మనది. ఇదంతా అమలు చేసేది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కాబట్టి వారి వేతనాలు కూడా పెంచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణ సాధించడంలో భాగంగా రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రోగం రాకుండా ఉండేందుకు నివారణ చర్యలు, ఆరోగ్య పరిరక్షణ ప్రోత్సాహక చర్యలు ఉండాలని భావించి ఈ ఆహారం అందిస్తున్నాం. ఒక్కోసారి పేదరికంలో జన్యు సంబంధ వ్యాధులతో పుడితే ఆ తల్లిదండ్రులకు వారికి కంటి మీద కునుకు ఉండదు. అందుకే సీఎం కేసీఆర్ గారు ఇలాంటి పరిస్థితి ఉండొద్దు అని గర్భిణీ స్త్రీలు పని చేయొద్దని, మంచి ఆహారం తీసుకోవాలని 12 వేల రూపాయలు ఇస్తున్నారు. డబ్బుల మొఖం చూసి కాదు.. మనిషి మొఖం చూసి ఇస్తున్నారు అని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

No comments:
Write comments