వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

 

శ్రీకాకుళం డిసెంబర్ 21 (globelmedianews.com):
గ్రామ  వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. స్థానిక  కిల్లిపాలెం పంచాయతీ లోని  అజంతా గార్డెన్స్ దగ్గర  రెండవ  గ్రామ సచివాలయ భవన శంఖుస్థాపన కార్యమానికి ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీ ఇచ్చినట్టుగా  రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రూ. 40 లక్షలతో ఈ సచివాలయం భవనాన్ని   ఏర్పాటు చేస్తున్నామని   తెలిపారు.  ప్రజల వద్దకే  సంపూర్ణ పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. కిల్లిపాలెం పంచాయతీకి రెండు గ్రామ సచివాలయాలు మంజూరు అయ్యాయని మొదటి సచివాలయం  కిల్లిపాలెంలో ఉండగా, పరిపాలనా సౌకర్యం కోసం  అజంతా గార్డెన్స్ వద్ద రెండవ దానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. 
వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

ఈ భవనం మర్చి 15, 2020 నాటికి కచ్చితంగా  పూర్తి చేయాలని  శ్రీ శ్రీ కనస్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్టర్ఎన్ని. రాజేష్ నాయుడుకి  శాసన సభ్యులు ఆదేశించారు. అలాగే వాలంటీర్లు  జనవరి 1 నుండి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రతి ఒక్కరికి వివరించి వాటిని త్వరితగతిన లబ్ధిదారులకు  చేర్చవల్సిన బాధ్యత  వాలంటీర్లదేనని అన్నారు. త్వరలో  ఈ కిల్లిపాలెం పంచాయతీ కూడా  శ్రీకాకుళం కార్పొరేషన్ లో కలిసిపోతుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుందని , మళ్ళీ  వార్డుల విభజన  చేయవలసి వస్తుందన్నారు. కాబట్టి  గ్రామ సచివాలయాల్లో సిబ్బంది అంతా సమష్టిగా పని చేసి ఉత్తమ పంచాయతీగా తయారు చేయాలని , ప్రభుత్వానికి   మంచి పేరు తీసుకురావాలన్నారు.  సచివాలయం కోసం  సేకరించిన  స్థలంలో  భవన నిర్మాణం తరువాత మిగిలిన స్థలాన్ని  అన్ని హంగులతో కూడిన పార్క్ ని  తయారు చేయాలని  అధికారులను ఆదేశించారు.   ఈ సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శాసన సభ్యులు  కేక్  కట్ చేశారు.

No comments:
Write comments