దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి: మంత్రి ఈటెల

 

హైదరాబాద్ డిసెంబర్ 14 (globelmedianews.com)
దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని, కొత్త దంత కళాశాలల ఏర్పాటు కంటే .. ఉన్న వైద్యులనే సరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.మాదాపూర్ సైబర్ కన్వెన్సన్‌లో తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. డెంటల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి: మంత్రి ఈటెల

ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ... విజ్ఞానం, ఆరోగ్య సాధనతోనే బంగారు తెలంగాణ సాధ్యం. వైద్య వృత్తిని అత్యంత సేవాభావంతో నిర్వహించాలి. ఇప్పుడు జెనెటిక్స్, సైన్స్‌కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభించాం. సమాజంలో స్త్రీ కన్నీరు పెండుతుంది. సమాజానికి అది మంచిది కాదు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వాడాలి. తెలంగాణ రాష్ట్రం మానవ సంబంధాలపై కూడా దృష్టి పెడుతుంది. ఆరోగ్యంలో దేశంలో నంబర్‌వన్ స్థానానికి చేరుకునేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

No comments:
Write comments