ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు

 

హైదరాబాద్ డిసెంబర్ 6, (globelmedianews.com)
దిశా ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలను పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దిశ ఘటనలో నిందితులను పోలీసులు కాల్చి చంపడం వల్ల  ఆమె ఆత్మకు శాంతి కలుగు తుందని  అన్నారు. దిశ  ఘటనలో రికన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులపై నిందితులు దాడి చేసే క్రమంలో ఆత్మ రక్షణలో భాగంగా  పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. 
ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు

రేపిస్టులకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలని అన్నారు..మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా రాకుండా చేసిన తెలంగాణ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీసులకు పలు ప్రాంతాల్లో మహిళలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీసులను చూసి దేశంలోని మిగతా పోలీసులు నేర్చుకోవాలని మహిళలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు పోలీసులకు రాఖీలు కట్టారు. పోలీసులపై స్థానికులు పూలవర్షం కురిపించారు.

No comments:
Write comments