చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్

 

కడప డిసెంబర్ 5 (globelmedianews.com)
కొన్ని రోజులుగా కనుమరుగు అయిన పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పటికి చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్. రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య మండిపడ్డారు. గురువారం అయన మీడియతో మాట్లాడారు.గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసి టీడీపీ కి అనుకూలంగా ప్రచారం చేశావ్. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ఎం చేశావని నిలదీసారు. గత టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే నిద్రపోయావా. పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కాలని చూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల తీర్పులో నీ స్థానం ఎంటి అనేది తెలుసుకుని మాట్లాడాలి. ప్రజల్లో అభిమానం లేకనే ఓట్లు పడలేదు. 
చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్

పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందిన ఏకైక నాయకుడని ఎద్దేవా చేసారు. అమిత్ షా ఏమైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చుస్తే మహారాష్ట్ర లో పట్టిన గతే పడుతుంది.  కులాల మధ్య చిచ్చు పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. చంద్రబాబు సూచనలతో పవన్ నడుస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అమర్యాదగా మాట్లాడుతారు. జగన్ రెడ్డి అంటూ అవహేళన గా మాట్లాడుతారు.కులాలను అడ్డం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది ఎవరని అయన ప్రశ్నించారు.కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేయడానికే పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ప్రతిపక్షం లో ఉన్నా అధికారంలో ఉన్నా కేవలం వైసీపీ పైనే ఆరోపణలు చేయడం హేయమైంది. గతంలో ట్వీట్లు అన్ని ఆంగ్లంలోనే పెట్టె వాడని అయన గుర్తు చేసారు. రోజుకొక ముసుగు ధరించి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలు అనడం సిగ్గుచేటు. ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేస్తే బాగుంటుంది.పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు చుస్తే అవగాహన లోపంతో చేస్తున్నారు అనేది బయట పడుతుందని అయన అన్నారు.

No comments:
Write comments