హింసాత్మ‌క నిర‌స‌న‌లు దుర‌దృష్ట‌క‌రం: ప్ర‌ధాని మోదీ

 

న్యూ ఢిల్లీ డిసెంబర్ 16 (globelmedianews.com)
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ హింసాత్మ‌క నిర‌స‌న‌లు చోటుచేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు ప్రదనమంత్రి నరేంద్ర మోడి.. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ప్ర‌ధాని మోదీ స్పందిస్తూ ఆందోళ‌న‌లు త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తున్నాయ‌ని ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి అంశాన్ని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని, కానీ ప్ర‌జా సంప‌ద‌ను ధ్వంసం చేయ‌డం స‌రికాద‌న్నారు. శాంతిని, ఐకమ‌త్యాన్ని, సోద‌ర‌భావాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం ఇదేన‌న్నారు. సాధార‌ణ జ‌న‌జీవ‌నాన్ని దెబ్బ‌తీయ‌డం ప‌ద్ధ‌తి కాద‌న్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ఉభ‌య‌స‌భ‌ల్లో భారీ మెజారిటీతో ఆమోదం పొందింద‌ని, అనేక రాజ‌కీయ పార్టీలు స్వాగ‌తించాయ‌ని, ఎంపీలు కూడా బిల్లుకు ఆమోదం ద‌క్కేలా మ‌ద్ద‌తు ఇచ్చార‌ని మోదీ తెలిపారు. 
హింసాత్మ‌క నిర‌స‌న‌లు దుర‌దృష్ట‌క‌రం: ప్ర‌ధాని మోదీ

విభిన్న సంస్కృతుల‌ను స్వాగ‌తించి, సోద‌ర భావాన్ని పెంపొందించే వంద‌లాది ఏళ్ల భార‌తీయ నైజానికి ఈ చ‌ట్టం అద్దంప‌డుతుంద‌న్నారు. క్యాబ్ వ‌ల్ల దేశంలో ఏ మ‌తానికి చెందిన వారికి కూడా ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నాన‌ని ప్ర‌ధాని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. భార‌తీయులు ఈ యాక్టు గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. విదేశాల్లో అన్నీ కోల్పోయి, కేవ‌లం భార‌త్‌లో మాత్రమే త‌ల‌దాచుకునేందుకు వ‌చ్చిన వారికి ఈ కొత్త చ‌ట్టం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మోదీ అన్నారు. అంద‌రం క‌లిసి భార‌త్ అభివృద్ధికి ప‌నిచేయాల‌ని, పేద, బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి అంద‌రూ పాటుప‌డాల‌న్నారు. స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం విభ‌జ‌న‌కు గురి చేసేవారిని, ఆందోళ‌న‌ల‌ను రెచ్చ‌గొట్టేవారిని ఎట్టిప‌రిస్థితుల్లో ప్రోత్స‌హించ‌రాదు అని మోదీ అన్నారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ దూరంగా ఉండాల‌ని మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.

No comments:
Write comments