బెట్టింగ్ ముఠా అరెస్ట్

 

విజయవాడ డిసెంబర్ 4 (globelmedianews.com)
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్  చేసారు. నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిటీ పోలీస్ కమీసిషనర్ ద్వారక తిరుమలరావు కేసు వివరాలను మీడియాకు తెలిపారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్,మోహన్ కృష్ణ,శరత్ చంద్ర తో పాటు పశ్చిమ గోదావరి కి చెందిన మోహన్ కృష్ణ ను అదుపులోకి తీసుకున్నాం. 
బెట్టింగ్ ముఠా అరెస్ట్

నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ,2 ల్యాప్ట్యాప్ లు,19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం. బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని అయన అన్నారు. టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. మారుతినగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఫోన్ సంభాషణ తో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. కాల్ కాన్ఫరెన్స్ తో క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నాయని సీపీ వివరించారు.

No comments:
Write comments