సీసీఎస్‌ ఎస్సై సైదులు గౌడ్‌ ఆత్మహత్య

 

హైదరాబాద్‌  డిసెంబర్ 23  (globelmedianews.com)
 సీసీఎస్‌ లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్‌లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 
సీసీఎస్‌ ఎస్సై సైదులు గౌడ్‌ ఆత్మహత్య

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:
Write comments