రజనీ కాంత్ సినిమా ఆపండి

 

చెన్నై, డిసెంబర్ 31 (globelmedianews.com)
కోలీవుడ్‌లో భారీ చిత్రాలకు రిలీజ్‌ సమస్యలు తప్పటంలేదు. చివరి నిమిషంలో సినిమాపై కాపీ ఆరోపణలు రావటం, లేదా ఆర్థిక సమస్యలు రావటం అనేది సర్వ సాధారణమైపోయింది. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమాకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. నిర్మాణ సంస్థ గత చిత్రం కోసం చేసిన అప్పుల కారణంగా దర్బార్‌ ఇబ్బందుల్లో పడింది.సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన దర్బార్‌ సినిమాను పొంగల్‌ కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే తాజాగా నిర్మాణ సంస్థ కారణంగానే ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి.
రజనీ కాంత్ సినిమా ఆపండి

దర్బార్‌ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందించాలంటూ మద్రాసు హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు పంపింది. గతంలో 2.ఓ సినిమా నిర్మాణంలో ఉండగా లైకా సంస్థ, మలేషియాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ డీఎంవై క్రియేషన్స్‌ నుంచి 12 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవటంతో ఇప్పుడు వడ్డీతో కలిపి 23 కోట్ల 70 లక్షలు అయ్యింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు దర్బార్‌ రిలీజ్‌ ఆపాలంటూ డీఎంవై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.డీఎంవై సంస్థ మలేషియాలో భారతీయ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. 2.ఓ సినిమాను కూడా ఈ సినిమా 20 కోట్ల మొత్తానికి మలేషియా డిస్ట్రిబ్యూషన్‌ రేట్స్‌ తీసుకుంది ఈ సంస్థ. అంతేకాదు ఇటీవల రిలీజ్‌ అయిన సైరా నరసింహారెడ్డితో పాటు విశ్వాసం, గేమ్‌ ఓవర్‌, సూపర్‌ 30 లాంటి సినిమాను మలేషియాలో డీఎంవై ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రిలీజ్‌ చేసింది.డీఎంవై సంస్థ పిటీషన్‌ను విచారించిన జస్టిస్ గోవిందరాజ్‌, జనవరి 2 లోగా పిటీషన్‌పై స్పందించాలని లైకా సంస్థలకు నోటిసులు ఇచ్చారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్‌, యోగి బాబు, జీవా, ప్రకాజ్‌ రాజ్‌, నివేదా థామస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments:
Write comments