సంస్కరణలు భేష్

 

హైద్రాబాద్, డిసెంబర్ 20, (globelmedianews.com)
ర్‌ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రశంసలు కురిపించారు. దేశంలోనే గొప్ప రాష్ర్టం తెలంగాణ అని కొనియాడారు. నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యుత్ పొదుపు అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు ఎక్కువగా చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ బల్బ్‌లు వాడుతున్నారు ఇది శుభపరిణామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. సీఎం కేసీఆర్ చాలా గొప్పగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నరని తెలిపారు. 
సంస్కరణలు భేష్

విద్యుత్ పొదుపు ఒక్కటే కాదు.. నీటిని కూడా పొదుపు చేయాలి. ఈ మేరకు విద్యార్థులు, ప్రజలకి విద్యుత్, నీటి పొదుపుపై అవగాహన కలిగించాలని గవర్నర్ పేర్కొన్నారువిద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంజినీరింగ్ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవం నేడు నగరంలో జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ తమిళిసై, మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల్లోనే విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అవసరం లేనిచోట విద్యుత్ వినియోగం తగ్గించి ఆదా పాటించాలన్నారు. విద్యుత్ పొదుపు అత్యంత కీలకమైన విషయమని.. విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు.

No comments:
Write comments