కార్గో కు రెడ్ బస్ కలర్ పేరు

 

హైద్రాబాద్, డిసెంబర్ 24, (globelmedianews.com)
ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి సంస్థతో పాటు ప్రభుత్వం అన్ని మార్గాలను అనే్వషిస్తోంది. సింగరేణి తరహలో లాభాలను సమక్చూకోవడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మరింత మెరుగైన సౌకర్యాలను అందివ్వడానికి సలహాలు, సూచినలు ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లేఖ లు రాస్తున్నారు. నష్టాల నుంచి వీలైనంత త్వరగా లాభాలు వచ్చే విధంగా సరుకు రవాణా ను బస్సుల ద్వారా రవాణా చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కార్గో రవాణాకు ‘రెడ్ బస్ కలర్’ పేరుగా నామకరణం చేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళణ చేయాలని, అందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఈడీలకు సూచించారు. ఆర్టీసీ సమ్మె విరమణ అనంతరం సంస్థ అధికారులు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందన్నారు. 
కార్గో కు రెడ్ బస్ కలర్  పేరు

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన హామీలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంస్థలోకొత్తగా ప్రవేశపేడుతున్న కార్గో సర్వీసులకు ‘రెడ్ బస్ కలర్’గా నిర్ణయించామని ఆయన గుర్తు చేశారు. మహిళా కండక్టర్‌లకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్‌ను అమలు చేయాల్సిందేనని మంత్రి ఆదేశించారు. డ్రెస్ కోడ్‌లకు సంబంధించిన డిజైన్ కూడా పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. బస్ ప్రయాణికులతో ప్రజా ప్రతినిధులు ప్రయాణించడంతో ఆర్టీసీ సమస్యలు తెలుసుకోవచ్చునని ఆయన సూచించారు.అక్యుఫెన్సీ రేషియో పెంపుకోసం తగిన చర్యులు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల భద్రత, రక్షణ అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈనెల 24 ఆర్టీసీ సిబ్బందితో వన భోజనాల కార్యక్రమాన్ని హైదరాబాద్ రీజియన్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఈడీలతో మంత్రి లోతుగా అధ్యయనం చేశారు. ప్రతి కార్మికుడు మంచి వాతావరణంలో పని చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగి మేడారం (వరంగల్) జాతరకు రాష్ట్రంలో అన్ని బస్ డిపోల నుంచి కండిషన్‌లో ఉన్న బస్‌లను నడపడానికి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. మేడారం జాతర నుంచి ఆర్టీసీకి నిధుల పరంపర ప్రారంభం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:
Write comments