`చూసీ చూడంగానే` చిత్రం ట్రైలర్ సంయుక్తంగా రిలీజ్ చేసిన పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు

 

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. ఈ  చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
`చూసీ చూడంగానే` చిత్రం ట్రైలర్  సంయుక్తంగా రిలీజ్ చేసిన పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు

రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది.నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.  డిసెంబర్ నెలలొ చివరి వారంలొ ఈ చిత్రం విడుదల కాబొతొంది.న‌టీన‌టులు: శివ కందుకూరి, వ‌ర్ష బొల్ల‌మ్మ, మాళవిక సతీశన్  త‌దిత‌రులు

No comments:
Write comments