యూ ట్యూబ్ లో రజనీ షేక్

 

చెన్నై, డిసెంబర్ 17 (globelmedianews.com
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం దర్బార్‌. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమనాు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది.సూపర్‌ స్టార్‌ నుంచి అభిమానులు ఏ ఏ అంశాలు ఆశిస్తారో అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు మురుగదాస్‌. చాలా కాలం తరువాత రజనీ యంగ్‌ అండ్‌ యాంగ్రీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో చూపించాడు. రజనీ మార్క్‌ స్టైల్‌ మిస్‌ కాకుండానే తనదైన టేకింగ్‌తో అదరగొట్టాడు.
యూ ట్యూబ్ లో రజనీ షేక్

ట్రైలర్‌లో యాక్షన్‌ హైలెట్‌గా నిలిచింది. రజనీ మేనరిజమ్స్‌, డైలాగ్స్‌ సూపర్బ్‌. ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ కావటంతో టీజర్‌ను రిపీట్‌ మోడ్‌లో చూస్తున్నారు తలైవా ఫ్యాన్స్‌.ట్రైలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర నుంచి రికార్డ్‌ల వేట మొదలు పెట్టాడు సూపర్‌ స్టార్‌. గంట గంటకు రికార్డ్ వ్యూస్‌ సాధిస్తూ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 12 గంటల్లో దాదాపు 12.4 మిలియన్ల (కోటీ 24 లక్షల) వ్యూస్‌ సాధించింది దర్బార్‌ ట్రైలర్‌ (తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి). అంటే ప్రతీ గంటకు పది లక్షలకు పైగా వ్యూస్‌ సాధిస్తోంది. లైక్‌లు, కామెంట్‌లు కూడా అదే స్థాయిలో వస్తుండటంతో రజనీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.రజనీ యంగ్ ఏజ్‌లో పలు చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాడు. వాటిలో పాండియన్‌ లాంటి చిత్రాలు సూపర్‌ హిట్ అయ్యాయి. దాదాపు 25 ఏళ్ల తరువాత మరోసారి పోలీస్‌ డ్రెస్‌ వేసుకున్నాడు సూపర్‌ స్టార్‌. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పోలీస్ డ్రెస్‌లో రజనీ యాక్షన్‌ మరో రేంజ్‌లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సినిమా అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ‘దర్బార్’లో రజినీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. రజనీకి జోడిగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార నటిస్తోంది.

No comments:
Write comments