బుధవారం ధర్మదర్శనం మాత్రమే

 

తిరుమల డిసెంబర్ 31 (globelmedianews.com)
నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1వ తేదీ ధర్మదర్శనం మాత్రమే కొనసాగిస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
బుధవారం ధర్మదర్శనం మాత్రమే

నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సోమవారం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1న తిరుమలకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని మంగళ, బుధవారాలలో నిత్య, వారపు ఆర్జితసేవలు, చంటిబిడ్డ తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, స్లాటెడ్ సర్వ, దివ్యదర్శనాలు, అంగప్రదక్షిణ టోకెన్ల జారీని రద్దు చేసినట్టు తెలియజేశారు.  వీఐపీ దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు.

No comments:
Write comments