టీడీపీ నిరసన

 

అమరావతి  డిసెంబర్ 16  (globelmedianews.com)
రివర్స్పాలన, తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై సచివాలయం అగ్నిమాపకకేంద్రం  నుంచి టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రకమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.  చంద్రబాబుతో సహా నేతలందరూ వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రివర్స్ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. 
టీడీపీ నిరసన

టెండర్లన్నీ రిజర్వ్ చేసుకొని రివర్స్ అంటున్నారని ఆరోపించారు. 2లక్షల కోట్ల విలువైన అమరావతిని ఆపేశారని దుయ్యబట్టారు. విదేశీపెట్టుబడులు రాని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేశ్  మాట్లాడుతూ  ఏడు నెలల జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని అన్నారు. రివర్స్ పాలనవల్ల సంక్షేమం, అభివృద్ధి అటకెక్కాయని విమర్శించారు. 'ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి' అని నారా లోకేశ్ మండిపడ్డారు.

No comments:
Write comments